English | Telugu
చిరు స్టెప్పు వేస్తానంటే.. చరణ్ వద్దన్నాడు
Updated : Oct 12, 2015
బ్రూస్లీలో చిరంజీవి ఓ అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లో చిరంజీవి కనిపించనున్నాడు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. అయితే చిరు ఓ పాటలోనూ కనిపిస్తారని, చరణ్ - చిరుల మధ్య సాగే ఆ పాట కజరారే... కజరారే తరహాలో వినూత్నంగా ఉంటుందని అంతకు ముందు ప్రచారం జరిగింది.
ఈపాట కోసం ఇలియానా, తమన్నా పేర్లు కూడా పరిశీలించారు. శ్రీనువైట్ల కూడా చిరుతో స్టెప్పులు వేయించాలనిచూశాడట. అయితే.. రామ్‌చరణ్ నో చెప్పాడట. ఈ విషయాన్ని చరణే స్వయంగా చెప్పుకొచ్చాడు. డాడీతో పాట చేయాలని నాకూ ఉంది.. అయితే, మగధీరల మా ఇద్దరి డాన్స్ ని అభిమానులు చూసేశారు. అందుకే ఫైట్ పెడితే బాగుంటుందని నేనే సలహా ఇచ్చా.. అని చెప్పుకొచ్చాడు చరణ్.
అంటే చిరు స్టెప్పు వేస్తానంటే చరణే అడ్డు చెప్పాడన్నమాట. నిజానికి చిరుకీ ఈ సినిమాలో డాన్స్ చేయాలనిపించింది. అందుకోసం రిహార్సల్స్ కూడా చేశాడు. ఓ పాట, ఫైటూ తీయడానికి సమయం సరిపోవడం లేదు. దాంతో పాటు ఐటెమ్ గాళ్ కూడా దొరకలేదాయె. అందుకే పాట వద్దనుకొన్నాడు చరణ్. చిరంజీవితో పాట చేయించాలనుకొంటే ఈ సినిమా మరికొంత ఆలస్యమయ్యేది. చరణ్ మంచి పనే చేశాడు లెండి.