English | Telugu

సన్నాఫ్ పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నాడహో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్‌ల కలల పంట, వారిద్దరి కుమారుడు అకిరా నందన్ త్వరలో వెండితెరంగేట్రం చేయబోతున్నాడట. అకిరా నందన్ బాల నటుడిగా నటించే ముహూర్తం త్వరలో రాబోతోందట. పవన్ కళ్యాణ్ పుత్రరత్నం సినిమాల్లో నటించబోతున్నాడంటే అది పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి విషయమే.

సాదారణంగా టాప్ హీరోల సంతానం చిన్నప్పుడే సినిమాల్లో నటించారూ అంటే, అది సదరు టాప్ హీరో చిన్నప్పటి కేరెక్టర్ అయి వుండటం సహజం. అయితే పవన్ కళ్యాణ్ కొడుకు విషయంలో మాత్రం అలా జరిగే అవకాశం లేనట్టు సమాచారం. అకిరా నందన్ నటించబోయేది పవన్ కళ్యాణ్ సినిమాలో కాదట.

రేణు దేశాయ్ దర్శకత్వం వహించబోయే ఓ మరాఠీ సినిమాలో అకిరానందన్ నటించబోతున్నాడట. పూణెలో స్థిరపడిన రేణు దేశాయ్ ఆమధ్య ఓ మరాఠీ సినిమాకు దర్శకత్వం వహించింది. తన తదుపరి సినిమాలో అకిరా నందన్‌ని బాల నటుడిగా పరిచయం చేయాలని ఆమె అనుకుంటోందట. దీనికోసం అకిరాకి ఇంట్లో తానే స్వయంగా నట శిక్షణ ఇస్తోందట. తన సినిమాలో కాకుండా బయటి సినిమా ద్వారా అకిరా నందన్‌ని నటుడిగా పరిచయం చేస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఫీలవుతాడో మరి... పవన్ కళ్యాణ్ సంగతి అలా వుంచండి... ఆయన అభిమానులు ఎలా ఫీలవుతారో ఏంటో...