English | Telugu

ఎన్టీఆర్‌పై కోపం ఇలా తీర్చుకొన్నాడా?


హ‌రి... ఈ ద‌ర్శకుడి పేరు తెలుగునాట ఇప్పుడు మార్మోగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఇత‌ని గురించే చ‌ర్చించుకొంటున్నారు. అలాగ‌ని తెలుగులో హ‌రి సినిమాలేం చేయ‌ట్లేదు. ఎన్టీఆర్‌తోనూ అత‌నికి దోస్తీ లేదు. మ‌రి ఎందుకు హ‌రి గురించి మాట్లాడుకొంటున్నారు? ఎందుకంటే ఈమ‌ధ్య హ‌రి అనే త‌మిళ ద‌ర్శ‌కుడు త‌మిళ మీడియాతో మాట్లాడుతూ ఓ సంచ‌ల‌న కామెంట్ చేశాడు. అదీ ఎన్టీఆర్ గురించి. తెలుగులో మీరు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నార్ట క‌దా? అని త‌మిళ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ `ఎన్టీఆర్‌.. ఆయ‌నెవ‌రు?` అన్నాడు. దాంతో మీడియా అవాక్క‌య్యింది. ఎన్టీఆర్ ఫైన్స్ ఫైర‌య్యారు. ఓ త‌మిళ ద‌ర్శ‌కుడికి, అందునా త‌న సినిమాల్లో తెలుగులోనూ రిలీజ్ చేసుకొనే ద‌ర్శ‌కుడికి ఎన్టీఆర్ గురించి తెలియ‌దు అన‌డం హాస్యాస్ప‌దం. ఎన్టీఆర్‌తో హ‌రి ఓ సినిమా చేద్దామ‌నుకొన్నాడు. ఎన్టీఆర్ అపాయింట్‌మెంట్ కూడా అడిగాడు. కానీ తార‌క్ అందుకు స్పందించ‌లేదు. ఆ కోపంతోనే.. ఇప్పుడు ఎన్టీఆర్ తెలియ‌దు అంటూ మీడియా ముందు త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా... ఎన్టీఆర్ విష‌యంలో హ‌రి నోరు జారేశాడు. సింగం 3 ప్ర‌మోష‌న్ల కోసం టాలీవుడ్‌లోకి అడుగు పెడ‌తాడు క‌దా?? అప్పుడైనా ఎన్టీఆర్ గురించి తెలుసుకొని వ‌స్తాడో, లేదో.. ఇక్క‌డి కొచ్చాక కూడా అదే స‌మాధానం రిపీట్ చేస్తాడో చూడాలి.