English | Telugu
రజనీకాంత్ ని అదే కాపాడిందట..!
Updated : Dec 16, 2014
ఇంకేముంంది, ఆల్ ఇండియా రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం అనుకొన్న `లింగ` అటు అభిమానులకూ, ఇటు విమర్శకులకూ షాక్ ఇచ్చింది. విడుదలకు ముందే దాదాపుగా రూ.160 కోట్ల బిజినెస్ చేసిన సూపర్‌స్టార్ సినిమా తొలి షో కే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొంది. ఈ సినిమాలో ఏమీ లేదని తమిళ నాట కొన్ని ప్రాంతాల్లో రజనీ అభిమానులకే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే టాక్‌తో సంబంధం లేకుండా శుక్ర, శని, ఆదివారాలు లింగ దుమ్ము దులిపింది. ఈ మూడు రోజుల్లోనూ దాదాపుగా రూ.80 కోట్ల రూపాయలు వసూలు చేసిందని టాక్. ఒక్క తమిళనాటే రూ.50 కోట్లకు పైగా రాబట్టిందట. సినిమా ఫ్లాప్ అయినా ఏంటీ రెస్పాన్స్?? అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. దానికి కారణం ఒకటుంది.. అదే అడ్వాన్స్ బుకింగ్. ఈ సినిమా విడుదలకు రెండ్రోజుల ముందే కౌంటర్లు తెరిచారు. తొలి మూడు రోజుల టికెట్లూ గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయి. అందుకే.. వసూళ్ల హవా ఎక్కడా తగ్గలేదని చెప్తున్నారు. అయితే సోమవారం నుంచి మాత్రం భయంకరంగా డ్రాప్ అయ్యాయి వసూళ్లు. ఏ లెక్కన చూసినా ఈ సినిమాని కొనుక్కొన్నవాళ్లు నిండా మునిగిపోవడం ఖాయమని... విశ్లేషకులు తేల్చేశారు. అదే ఎంతకూ.... అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.