English | Telugu
సంక్రాంతి తర్వాత ‘రేయ్’ విడుదల!!
Updated : Dec 16, 2014
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’ సినిమా సంక్రాంతి తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా విడుదలకు నోచుకోకుండా ఉంది. సినిమా ప్రారంభమై దాదాపుగా నాలుగు సంవత్సరాలు అయినా కూడా సినిమా విడుదలకు మాత్రం అనేక అడ్డంకులు రావడంతో విడుదల డేటు రావడం లేదు. ఆ మద్య పలు సార్లు విడుదల డేట్లు ప్రకటించిన తర్వాత వాయిదా పడటం జరిగింది. ఇక ఇటీవల కొన్ని నెలలుగా ‘రేయ్’ సినిమాకు సంబంధించిన వార్తలే రాలేదు.
తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రెండవ సినిమా ‘పిల్లా నవ్వులేని జీవితం’ విడుదల అవ్వడంతో మరోసారి ‘రేయ్’ సినిమాలో కదలిక వచ్చింది. మొదటి సినిమా సక్సెస్‌తో రెండవ సినిమాను కొనేందుకు బయ్యర్లు ముందుకు సంక్రాంతి తర్వాత ‘రేయ్’ వస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి తర్వాత విడుదల చేయాలని చిత్ర దర్శకుడు, నిర్మాత అయిన వైవీఎస్ చౌదరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారైన ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో..!