English | Telugu

రాధికా ఆప్టే సెక్స్ సీన్స్‌ ర‌హ‌స్యం.... ఇదేనా?

ఇంట‌ర్నెట్‌లో లీకైన రాధికా ఆప్టే సెక్స్ సీన్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. నెటింజ‌న్లు ఈ సీన్ల‌ను షేర్ చేసుకొంటూ వెళ్ల‌పోతుండ‌డంతో ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఈ స‌న్నివేశాల్ని ఇంట‌ర్నెట్‌లో ఎవ‌రు లీక్ చేశారన్న‌ది ప‌క్క‌న పెడితే... రాధికా ఆప్టే గురించీ, ప‌ర్చెడ్ సినిమా గురించీ జ‌నం మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు. ఈ వీడియో లేకేజీ వెనుక ర‌హ‌స్యం కూడా అదే. ప‌ర్చేద్ సినిమాని కేవ‌లం ఫిల్మ్‌ఫెస్టివ‌ల్స్ కోస‌మే రూపొందించారు. ఆసినిమాకి బాక్సాఫీసు ముందుకు తీసుకొచ్చే ఉద్దేశ‌మే లేదు. అయితే.. ఇప్పుడు ఆ సినిమాని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం పూర్త‌యిన సినిమా అది. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎవ‌రు ప‌ట్టించుకొంటారు? పైగా ఆర్ట్ సినిమా అనే ముద్ర ఎలాగూ ప‌డిపోయింది. అందుకే తెలివిగా రాధికా ఆప్టే న్యూడ్ సీన్ల‌ను లీక్ చేసేసింది చిత్ర‌బృందం. దాంతో ఆ సినిమా పేరు తొలిసారిగా ఎక్కువ మందికి తెలిసింది. లీకైన స‌న్నివేశ‌మే అంత హాట్ హాట్‌గా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజులో ఉంటుందో.... అని ఎగ‌బ‌డేవాళ్లు ఉంటారు క‌దా, వాళ్ల‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్న‌మే ఇదంతా అని బాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దానికి తోడు రాధికా ఆప్టే అంటే తెలుగు, త‌మిళం ప్రేక్ష‌కుల‌కూ తెలుసు. ఈ సినిమాని ఈ భాష‌ల్లో డ‌బ్ చేయ‌డం ద్వారా కొంత సంపాదించొచ్చు. అలా.. ప‌ర్చేద్ సినిమాని ప‌ర్చేజ్ చేసుకోవ‌డానికే ఇదంతా చేశార‌ని బాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.