English | Telugu

జ‌న‌తా గ్యారేజ్‌లో కేసీఆర్ హ్యాండ్‌

ఓ సోష‌ల్ మెసేజీకి క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇవ్వ‌డం ఎలాగో.. కొర‌టాల శివ‌కు బాగా తెలుసు. న‌రుక్కుంటూ పోతే ఈ భూమ్మీద మ‌నుషేలే ఉండ‌రు కాబ‌ట్టి.. వీలైతే ప్రేమిద్దాం అనే సందేశాన్ని మిర్చితో ఇచ్చారు కొర‌టాల‌. గ్రామాల్ని ద‌త్త‌త తీసుకొంటే దేశం బాగు ప‌డుతుంద‌ని శ్రీ‌మంతుడులో నిరూపించారు. జ‌న‌తా గ్యారేజ్‌లోనూ అంతే. మొక్క‌లు నాటడాన్ని హీరో ఓ ఉద్య‌మం కింద న‌డ‌ప‌డాన్ని ఈ సినిమా క‌థ‌గా మ‌లిచారు కొర‌టాల శివ‌. ఇంచుమించు తెలంగాణ‌లో కేసీఆర్ చేప‌ట్టిన హ‌రిత వ‌నం కాన్సెప్ట్ కూడా ఇదే. ఇటీవ‌ల ల‌క్ష‌ల మొక్క‌ల్ని నాటి... ఆ మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ‌ని ఓ ఉద్య‌మ స్థాయిలో మ‌లిచారు కేసీఆర్‌. ఇప్పుడు కూడా హ‌రిత వ‌నం పోగ్రాం ఉదృతంగానే న‌డుస్తోంది. అందుకే... ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కేసీఆర్‌ని కూడా వాడుకోవాల‌ని చిత్ర‌బృందం ఆలోచిస్తోంద‌ట‌. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రాన్ని కేసీఆర్ కి చూపించి, ఆయ‌న మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ని స‌మాచారం. అంతేకాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకీ ప్ర‌త్యేకంగా షో వేయాల‌న్న యోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. వాళ్లు ఈసినిమా గురించి నాలుగు మంచి ముక్క‌లు మాట్లాడితే.. జ‌న‌తా గ్యారేజ్ రేంజే వేరుగా ఉంటుంది క‌దా?? అదీ... కొర‌టాల శివ ప్లాన్‌. వ‌ర్క‌వుట్ అయితే మాత్రం.. బ్ర‌హ్మాండంగా ఉంటుంది. ఏం జ‌రుగుతుందో చూడాల‌తి.