English | Telugu

పూరి మ‌ళ్లీ చిరుకి ద‌గ్గ‌ర‌వుతున్నాడా?

చిరంజీవి 150వ సినిమాపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. త‌న రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వాల‌ని చిరుకీ ఉన్నా, స‌రైన క‌థ రాక‌పోవ‌డంతో ఆయ‌నా మీన‌మేషాలు లెక్కేస్తున్నాడు. అఖిల్ సినిమాని వినాయ‌క్ సూప‌ర్ డూప‌ర్ హిట్ చేస్తే - ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకొంటూ త‌న 150వ సినిమాని వినాయ‌క్‌కే అప్ప‌గించాల‌ని చిరు భావించాడు. కానీ.. అది కాస్త రివ‌ర్స్ అయ్యింది.

అఖిల్ సినిమా ఫ్లాప్‌లో ఎక్కువ భాగం వినాయ‌క్ మోయాల్సివ‌చ్చింది. దాంతో.. ఇప్పుడు మ‌ళ్లీ చిరు చూపులు పూరిపై ప‌డిన‌ట్టు టాక్‌. పూరి ఆల్రెడీ చిరు కోసం స‌గం క‌థ రెడీ చేశాడు. మిగిలిన స‌గం క‌థా ఓకే చేయించుకొంటే `ఆటోజానీ`కి మోక్షం వ‌చ్చేసిన‌ట్టే. `అన్న‌య్య‌.. సెకండాఫ్ మ‌ళ్లీ రాసుకొస్తా` అంటూ పూరి..చిరుకి ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌ని టాక్‌.

ఈద‌శ‌లో పూరి త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేని చిరు.. అందుకు సానుకూలంగానే స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం లోఫ‌ర్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు పూరి. ఇవి ఓ కొలిక్కిరాగానే `ఆటోజానీ` స్ర్కిప్టుతో బిజీ అవుతాడ‌ని తెలుస్తోంది. చిరు అటు పూరీకి, ఇటు వినాయ‌క్‌కీ సంక్రాంతి వ‌ర‌కూ గ‌డువు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈలోగా ఎవ‌రు క‌థ తో మెప్పిస్తే.. వాళ్ల‌కు మెగా సినిమా ఛాన్స్ అందే అవ‌కాశం ఉంది.