English | Telugu

అఖిల్ క్రెడిట్ వినాయక్ ది కాదట!!

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన అఖిల్ మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని అక్కినేని వారికి, నితిన్ కి పెద్ద షాక్ నిచ్చింది. దీంతో బయ్యర్లు - డిస్ర్టిబ్యూటర్లకు సమాధానం చెప్పుకోవాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడింది. అఖిల్ తన రెమ్యునరేషన్ లో నుంచి సగం వెనక్కి ఇచ్చేసినట్టు టాక్. అలాగే నాగార్జున కూడా పంపిణీదారులందరినీ పిలిచి మునుముందు రిలీజయ్యే అక్కినేని సినిమాల్ని రీజనబుల్ రేటుకే ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వినాయక్ మాత్రం ఒక్క పైసా ఇవ్వనని తేల్చి చెప్పాడట.అఖిల్ ప్రాజెక్ట్ స్టొరీ దగ్గర నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ని, నిర్మాతని డిసైడ్‌ చేయడం వరకు అన్నీ నాగార్జున డెసిషన్లే కనుక పరాజయానికి తాను బాధ్యత తీసుకోనని అంటున్నాడట. తనకి ఇచ్చిన కథతో, తనకి ఇచ్చిన టెక్నీషియన్లతో చేయగలిగింది చేసానని చెబుతున్నాడట. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.