English | Telugu
ప్రిన్స్ నయా రికార్డ్..పారితోషకం 25కోట్లు
Updated : Nov 16, 2015
సూపర్ స్టార్ మహేష్ బాబు 'దూకుడు' మామూలు రెంజులో లేదు. టాలీవుడ్ అగ్రహీరోలకి అందనంత రెంజుకి రోజురోజుకి ఎదిగిపోతున్నాడు. ప్రతి సినిమాను తన గత చిత్రానికంటే విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా మహేష్ బాబు పారితోషకంలో రజనీకాంత్ సరసన చేరి కొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో ఎవరు తీసుకోనంత పారితోషకం అక్షరాల 25కోట్లు తీసుకొని నయా రికార్డ్ సృష్టించాడు. ఇంతకముందు రజనీకాంత్ మాత్రమే ఈ రేంజులో పారితోషకం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలో దర్శకుడు మురుగదాస్ తో చేయబోయే భారీ బడ్జెట్ సినిమాకి మహేష్ ఈ పారితోషకం అందుకోబోతున్నాడు. ఈ సినిమా 2016 సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం వుంది. ఈ సినిమాలో ఓ బడా బాలీవుడ్ హీరోయిన్ తో మహేష్ రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు మీ కోసం తీసుకురాబోతోంది తెలుగువన్.