English | Telugu

సోనూ సూద్‌... అప్పుడు 2, ఇప్పుడు 4?

కరోనా కాలంలో కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సోనూ సూద్‌ సహాయం చేశారు. రీల్‌ లైఫ్‌లో విలన్‌ క్యారెక్టర్లలో నటించిన ఆయన, రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా నిలిచారు. కొందరు ఆయన్ను జీసస్‌గా కొలిచారు. ఇప్పుడు ప్రజల్లో సోనూ సూద్‌కి క్రేజ్‌ ఉంది. దాన్ని క్యాష్‌ చేసుకోవాలని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారట. సోనూ సూద్‌ చెప్పిన రెమ్యూనరేషన్‌ విని వాళ్ళకు షాక్‌ తగిలిందట.

కరోనాకి ముందు ఒక్కో సినిమాకి సోసూ సూద్‌ ఒకటిన్నర నుండి రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకునేవారు. ఇప్పుడు దాన్ని 3.5 నుండి 4 కోట్ల రూపాయలు చేశారట. విలన్‌ పాత్రకు అంత అమౌంట్‌ ఎవరిస్తారని ఇండస్ట్రీలో కొందరు కామెంట్‌ చేస్తున్నారు. మరికొంతమంది ప్రస్తుతం ప్రజల్లో సోనూ సూద్‌కి ఉన్న క్రేజ్‌ చూసి ఇచ్చినా తప్పు లేదంటున్నారట.

ఇంతకు ముందు సోనూ సూద్‌ దగ్గరకు నెగిటివ్‌ రోల్స్‌ చేయమని ఎక్కువమంది వెళ్ళేవారు. ఇప్పుడు కొందరు పాజిటివ్‌ రోల్స్‌తోనూ వెళ్తున్నార్ట. హీరోగా రెండు మూడు కథలు వచ్చాయని సోనూ సూద్‌ సైతం మొన్నామధ్య చెప్పారు. త్వరలో హీరోగా వెండితెర మీదకు సోనూ సూద్‌ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.