English | Telugu

ప్రకాష్‌రాజ్ కూరగాయల బిజినెస్

నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలోని ‘కొండారెడ్డిపల్లి’ అనే ఊరిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి ప్రకాష్ రాజ్ తన కృత నిశ్చయాన్ని పదిరోజులకు ఓసారి ప్రకటిస్తూనే వున్నాడు. ఒక ఊరిని దత్తత తీసుకోవడం ద్వారా ప్రకాష్ రాజ్ ‘శ్రీమంతుడు’ అయ్యాడు. అయితే ప్రకాష్ రాజ్ ఈ ఊరిని దత్తత తీసుకోవడం వెనుక ఇంకా డబ్బులు సంపాదించి, ఇంకా పెద్ద ‘శ్రీమంతుడు’ అయ్యే ఆలోచనలు కూడా వున్నాయని తెలుస్తోంది. కొండారెడ్డి పల్లిలో ప్రకాష్‌రాజ్‌కి దాదాపు యాభై ఎకరాల వ్యవసాయ భూమి వుందట. అందులో ప్రకాష్ రాజ్ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాడట. ఆ కూరగాయలను త్వరలో హైదరాబాద్‌లో కార్పొరేట్ లెవల్లో అమ్మబోతున్నాడట. తాను భవిష్యత్తులో చేయబోయే కూరగాయల వ్యాపారానికి ప్రచారం వచ్చేలా వుంటుందని ప్రకాష్ రాజ్ సదరు ఊరిని దత్తతకు తీసుకున్నాడన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సరే, ఒక మంచి పని చేయడం వెనుక స్వార్థం వున్నప్పటికీ మనం హర్షించాల్సిందే.