English | Telugu
కృష్ణవంశీ డైరెక్షన్లో అనుష్క?
Updated : Nov 12, 2015
దర్శకుడు కృష్ణవంశీ ‘రుద్రాక్ష’ అనే పేరుతో ఓ భారీ గ్రాఫిక్స్ సినిమాని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్ అని కూడా వార్తలు వచ్చాయి. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలోనే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. సమంత నటించబోతోందని కొన్నిరోజులు, లేదు లేదు తమన్నా నటించబోతోందని మరికొన్ని రోజులు వినిపించింది. అయితే ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం అందబోతోంది. దిల్ రాజు బ్యానర్లో రూపొందే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో యాక్ట్ చేయానికి అనుష్క ఓకే అందని, అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా అయిపోయాయని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం దిల్ రాజు తీయబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘రుద్రాక్ష’ మాత్రమే. అంటే అనుష్కే ‘రుద్రాక్ష’ సినిమాలో హీరోయిన్ అని ఫిలిం నగర్ వర్గాలు డిసైడ్ అయ్యాయి. అంటే కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ అనుష్క... ఇది కన్ఫమ్..