English | Telugu
నాగ చైతన్య పిచ్చ హ్యాపీ!
Updated : Nov 12, 2015
నాగచైతన్య పిచ్చ హ్యాపీగా వున్నట్టు సమాచారం. నాగచైతన్య సోదరుడు, నాగార్జున కుమారుడు అఖిల్ నటించిన ‘అఖిల్’ సినిమా దీపావళి రోజున విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై రిజల్ట్ బయటకి వచ్చినప్పటి నుంచి నాగచైతన్య పిచ్చ హ్యాపీగా వున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య నటించిన మొదటి సినిమా ‘జోష్’ బాక్సాఫీసు దగ్గర ఢమాల్ అంది. ఆ తర్వాత నాగ చైతన్య నానా తంటాలు పడితేగానీ హిట్ దక్కలేదు. ప్రేక్షకులు చాలా నిర్దాక్షిణ్యంగా వుంటారు. నాగార్జున కొడుకు కదా.. అతని మొదటి సినిమా కదా.. బాగాలేకపోయినా హిట్ చేసేద్దాంలే అనుకోరు. అందుకే ‘జోష్’ని ఫ్లాప్ చేశారు. మొదటి సినిమా ద్వారానే ప్రేక్షకుల నుంచి పెద్ద షాక్ అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు తన సోదరుడి మొదటి సినిమా ‘అఖిల్’ విడుదలైన తర్వాత హ్యాపీగా వుండటానికి గల కారణాలేంటా అని సినిమా పండితులు ఆలోచిస్తున్నారు. ‘అఖిల్’ హిట్టయిందా? అందుకే నాగ చైతన్య అన్న మనసుతో సంతోషిస్తున్నాడా? లేక ‘అఖిల్’ ఫ్లాపయిందా... అఖిల్‌కి కూడా మొదటి సినిమా ఫ్లాప్ అయినందుకు నాగ చైతన్య ఆనందిస్తున్నాడా అనే డౌట్లు వస్తున్నాయి. ఈ డౌట్లు క్లారిఫై అవ్వాలంటే రెండు మూడు రోజులు ఆగాలిమరి.