English | Telugu

ఫ‌స్ట్ టైమ్.. లేడీ డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్ప‌టివ‌ర‌కు 19 చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించారు. విడుద‌ల‌కు సిద్ధ‌మైన `రాధేశ్యామ్` 20వ సినిమా. అలాగే చేతిలో మ‌రో మూడు ప్రాజెక్ట్స్ (స‌లార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్టోరియ‌ల్) ఉన్నాయి. విశేష‌మేమిటంటే.. ఇవ‌న్నీ కూడా మేల్ డైరెక్ట‌ర్స్ తెర‌కెక్కించిన‌, తెర‌కెక్కిస్తున్న చిత్రాలే.

క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ప్ర‌భాస్ ఓ ఫిమేల్ డైరెక్ట‌ర్ తో జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్లు టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఇరుది సుట్రు` (త‌మిళ్), `గురు` (తెలుగు), `సూరారై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) చిత్రాల‌తో ద‌ర్శ‌కురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధ కొంగ‌ర‌.. ఇటీవ‌ల ప్ర‌భాస్ కి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ వినిపించార‌ట‌. అది న‌చ్చ‌డంతో.. సినిమా చేసేందుకు ప్ర‌భాస్ కూడా ఆస‌క్తి చూపించార‌ట‌. అంతేకాదు.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయ‌మ‌ని సుధ‌కు సూచించార‌ట ప్ర‌భాస్. ప్ర‌స్తుతం ఆ స్క్రిప్ట్ వ‌ర్క్ లోనే ఉన్నార‌ట సుధ‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఏదిఏమైనా.. త‌న కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ప్ర‌భాస్ ఓ లేడీ డైరెక్ట‌ర్ తో ప‌నిచేయ‌నుండ‌డం ఆస‌క్తిక‌ర‌మ‌నే చెప్పాలి.

మ‌రో వైపు.. `త‌ల‌` అజిత్, సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతోనూ సుధ కొంగ‌ర సినిమాలు చేయ‌నున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.