English | Telugu

`స‌లార్`.. సిస్ట‌ర్ గా రమ్య‌కృష్ణ‌?

`సాహో` త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `స‌లార్`. `కేజీఎఫ్` కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని హొంబ‌ళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్ర‌భాస్ కి జోడీగా చెన్నైపొన్ను శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ ప్రాజెక్ట్ కి `కేజీఎఫ్‌` స్వ‌ర‌క‌ర్త ర‌వి బ‌స్రూర్ బాణీలు అందిస్తుండ‌గా.. భువ‌న్ గౌడ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి కొంత‌మేర చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ఇదిలా ఉంటే.. `స‌లార్`లో సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ప్ర‌భాస్ కి అక్క‌గా ర‌మ్య‌కృష్ణ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ని.. వీరిద్ద‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు చాలా ఎమోష‌న‌ల్ గా ఉంటాయ‌ని తెలిసింది. అంతేకాదు.. ఈ సిస్ట‌ర్ సెంటిమెంట్ సీన్సే సినిమాకి ప్ర‌ధాన బ‌ల‌మ‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే `స‌లార్`లో ర‌మ్య‌కృష్ణ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

కాగా, ప్ర‌భాస్ న‌టించిన `అడ‌వి రాముడు`(2004)లో ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించిన ర‌మ్య‌కృష్ణ‌.. ఆపై `బాహుబ‌లి` సిరీస్ (2015, 2017)లో రాజ‌మాత శివ‌గామిగా విశేషంగా అల‌రించారు.

`స‌లార్`ని 2022 ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీని కంటే ముందు పిరియ‌డ్ రొమాంటిక్ సాగా `రాధేశ్యామ్`తో ప్ర‌భాస్ ప‌ల‌క‌రించ‌నున్నారు.