English | Telugu

బ‌ర్నింగ్‌స్టార్‌కి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.. వార్నింగ్‌

ఈమ‌ధ్య పేర‌డీల‌కూ, స్నూఫ్‌ల‌కూ అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్ర‌తీదాన్నీ కామెడీ చేసేస్తున్నారు సినిమావాళ్లు. ఇప్పుడు బాహుబ‌లినీ పేర‌డీ చేసేశారు? స‌ంపూర్నేష్ బాబు కొత్త సినిమా కొబ్బ‌రిమ‌ట్ట - ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ బాహుబ‌లి తొలిపోస్ట‌ర్‌కు వీర స్నూఫ్‌. చూడ్డానికి కామెడీగాఉన్నా.. ఈ స్నూఫ్ మాత్రం కొంద‌రికి న‌చ్చ‌లేదు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ, బాలీవుడ్‌కీ వ‌ణుకు తెచ్చిన మేటి సినిమాని వెట‌కారం చేస్తావా... అంటూ బ్రర్నింగ్ స్టార్‌పై విరుచుకుప‌డుతున్నారు.

పేర‌డీల‌కూ ఓ హ‌ద్దుండాల‌ని ఫేస్ బుక్‌లో కామెంట్లు పంపుతున్నారు. వీటిపై సంపూ కూడా స్పందించాడు. కేవ‌లం తాము స‌ర‌దా కోస‌మే ఈ పోస్ట‌ర్ డిజైన్ చేశామ‌ని, వీటి వెనుక చెడు ఉద్దేశాలు ఏం లేవ‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌భాస్‌, రాజ‌మౌళి అభిమానులు త‌మ ప్ర‌య‌త్నానికి నొచ్చుకొంటే సారీ అన్నాడు. కొంత‌మంది బాధ‌ప‌డితే ఏంటి? సంపూకి రావ‌ల్సిన‌ప్ర‌మోష‌న్ మాత్రం ఫ‌స్ట్ లుక్ లోనే వ‌చ్చేసింది. అది చాల‌దూ.