English | Telugu

బాహుబ‌లి 2 ...30 కోట్ల న‌ష్టం

తెలుగునాట మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ అంటే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళినే చెప్పుకోవాలి. సినిమాకి సంబంధించి ఎంత రీసెర్క్ చేయాలో, అంతా చేస్తే గానీ.. సినిమా మొద‌లుపెట్ట‌రు. ఇప్పుడు బాహుబ‌లి 2కీ అదే వ‌ర్క్ జ‌రుగుతోంది. బాహుబ‌లి తీస్తున్న‌ప్పుడే పార్ట్ 2కి సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాలు తీశాడు రాజ‌మౌళి. పార్ట్ 2లోని క‌నీసం 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది కూడా. ఆయా స‌న్నివేశాల్ని ఎడిట్ చేసి చూసుకొన్న రాజ‌మౌళి వాటిపై అసంతృప్తితో ఉన్నాడ‌ట‌.

బాహుబ‌లి 1 ఘ‌న విజ‌యంతో పార్ట్ 2పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈసారి బాలీవుడ్ ఈ సినిమాపై మ‌రింత‌గా దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. వాళ్లంద‌రి ద‌గ్గ‌రా మ‌రోసారి కాల‌ర్ ఎగ‌రేయాలంటే పార్ట్ 2ని అదిరిపోయేలా తీయాల్సిందే. అందుకే ఇప్పుడు పార్ట్ 2లో ఇప్ప‌టి వ‌ర‌కూ తీసిన స‌న్నివేశాల్ని పూర్తిగా పక్క‌న పెట్టేయాల‌ని రాజ‌మౌళి నిర్ణయించుకొన్నాడ‌ట‌. మూల క‌థ‌లో మార్పులు చేయ‌డం వ‌ల్లే.. పార్ట్ 2ని మారుస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్, రానా, అనుష్క‌ల‌కు పార్ట్ 2లోని స‌న్నివేశాల్ని ఎడిట్ చేసి చూపించాడ‌ట రాజ‌మౌళి.

వాళ్లూ అదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డంతో బాహుబ‌లి 2ని మ‌ళ్లీ కొత్త‌గా తీయాల‌ని రాజ‌మౌళి ప్రిపేర్ అయిపోయాడు. రాజ‌మౌళి నిర్ణ‌యం వ‌ల్ల చిత్ర‌బృందానికి క‌నీసం రూ.30 కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌బోతోంని టాక్‌. అయినా స‌రే.. నిర్మాత‌లూ కూడారాజ‌మౌళి నిర్ణ‌యానికి ప‌చ్చ‌జెండా ఊపేశారు. ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కం అంటే అలా ఉండాలి. రాజ‌మౌళినా మ‌జాకా??