English | Telugu

మెగా 150లో పవర్ స్టార్ రోల్ ఏంటంటే..!!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రంలో మెగా ఫ్యామిలీ హీరోలందరూ నటిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ తాను ఒక పాటలో కనిపించనున్నాని కన్ఫర్మేషన్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్ లు కూడా ఏదో ఒక సన్నివేశంలో కనిపించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. కాగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తాను కనిపించే సన్నివేశాన్ని స్పెషల్ గా డిజైన్ చేయించుకొంటున్నాడట. "శంకర్ దాదా జిందాబాద్" తరహాలోనే ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో పవర్ ప్యాక్డ్ గెస్ట్ రోల్ చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇకపోతే.. ఇటీవల జైల్ సెట్ లో తీసిన చిరంజీవి ఎంట్రీ సీన్స్ ను రీషూట్ చేస్తున్నట్లు టాక్. ఔట్ పుట్ చూసుకొన్న చిరంజీవి, ఆశించిన స్థాయిలో రాకపోవడం, సినిమాకి ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ కావడంతో.. సదరు సన్నివేశాన్ని మళ్ళీ షూట్ చేయించాలని ఫిక్స్ అయ్యాడట!