English | Telugu
అఖిల్ పెళ్ళి చేసుకుంటే జోకర్ అవుతాడా..?
Updated : Jul 19, 2016
అన్నయ్య అందించిన ప్రోత్సాహంతోనో లేక నాన్న ఇచ్చిన ఉత్సాహంతోనో తెలియదు గానీ.. 22 ఏళ్ళు నిండగానే తన ప్రేమ వ్యవహారాన్ని బట్టబయలు చేసేశాడు. ఇక నాన్న నాగార్జున కోప్పడకుండా సంతోషంగా తన నిర్ణయాన్ని సమ్మతించడంతో అక్కినేని అందగాడికి ఆనందం అదుపుతప్పి.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. అప్పుడే పెళ్ళేంట్రా బాబు అని నాన్న నాగార్జున మొదలుకొని స్నేహితులందరూ వరుసబెట్టి క్లాసులు పీకారు. అన్నయ్య నాగచైతన్య కూడా రంగంలోకి దిగి.. ముందు హీరోగా సెటిల్ అవ్వు, ఆ తర్వాత పెళ్లి చేసుకొందువుగానీ. ఈలోపు ఎంగేజ్ మేంట్ చేసుకో. రీల్ లైఫ్ లో హీరోగా ప్రూవ్ చేసుకొని పెళ్లి చేసుకొంటే రియల్ లైఫ్ లోనూ హీరో అవుతావు. లేదంటే.. జోకర్ అయిపోతావు అంటూ అఖిల్ స్నేహ బృందం చెప్పిన మాటలకి ఆవేశం తగ్గి ఆలోచనలోపడిన అక్కినేని అఖిల్.. పెళ్లి ఆలోచన మానుకొని, అన్నయ్య చెప్పినట్లుగా ముందు ఎంగేజ్ మెంట్ చేసుకొని తన రెండో సినిమాకి సంబంధించిన పనులు మొదలెట్టాలని ఫిక్సయ్యాడట!