English | Telugu

ప‌వన్ మ‌ళ్లీ నాశ‌నం చేసేశాడా..??

కొంత‌మంది స్టార్ హీరోల‌కు కెలుకుడు అల‌వాటు.. వీర లెవిల్లో ఉంటుంది. అయితే... అది ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర ఇంకాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది. ప‌వ‌న్‌లో ఓ ద‌ర్శ‌కుడూ ఉన్నందువ‌ల్లో, లేదంటే త‌న ద‌ర్శ‌కుల‌పై న‌మ్మ‌కం లేనందువ‌ల్లో ఏమో.... త‌న సినిమా అనేస‌రికి కెలికేస్తుంటాడ‌ని టాక్‌. గ‌బ్బ‌ర్ సింగ్ నుంచీ త‌న జోక్యం విప‌రీతంగా మొద‌లైంద‌ని, ఆ సినిమా హిట్ట‌వ్వ‌డంతో అది మ‌రింత పెరిగింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతుంటాయి. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫ్లాప్ అవ్వ‌డానికి కార‌ణం.... ఆ చిత్ర ద‌ర్శ‌కుడు బాబీకి స్వేచ్ఛ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే అని, అస‌లు ఆ సినిమా సెట్లో బాబీని డైర‌క్ష‌న్ చేయ‌నివ్వ‌లేద‌ని, ఆయ‌న చుట్ట‌పు చూపుగా వ‌చ్చి వెళ్లిపోయేవాడ‌ని చెప్పుకొన్నారు.

ఇప్పుడు డాలీ ప‌రిస్థితీ అంతేన‌ట‌. కాట‌మ‌రాయుడు సెట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌దే హ‌వా అని, ప‌వ‌న్ చెప్పిన‌ట్టే ఫ్రేములు సెట్ చేస్తున్నాడ‌ని, సీను పేప‌ర్ చ‌దివి.. అప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ మార్పులు సూచిస్తున్నాడ‌ని.. ప‌వ‌న్ చెప్పింది తు.చ త‌ప్ప‌కుండా డాలీ ఆచ‌రిస్తున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క‌న ఈ సినిమా ప‌రిస్థితి కూడా స‌ర్దార్‌లా అవుతుందేమో అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ద‌ర్శ‌కుడికి స్వేచ్ఛ ఇస్తేనే క‌దా.. త‌న‌లో ఉన్న టాలెంట్ బ‌య‌ట‌ప‌డుతుంది. సొంత పైత్యం చూపించాల‌నుకొంటే... త‌నే సినిమాల్ని తీసుకోవొచ్చుగా. మ‌రో ద‌ర్శ‌కుడి పేరు పాడు చేయ‌డం ఎందుకు..??