English | Telugu

'కింగ్ మేక‌ర్' కాబోతున్న మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లో 'కింగ్ మేక‌ర్'గా ప‌ల‌క‌రించ‌బోతున్నారా? అవున‌న్న‌దే ఫిల్మ్ న‌గ‌ర్ ఇన్ఫ‌ర్మేష‌న్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళంలో ఘ‌నవిజ‌యం సాధించిన 'లూసిఫ‌ర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ పోషించిన పాత్ర‌ని తెలుగులో చిరంజీవి ధ‌రించ‌నున్నారు.

'హ‌నుమాన్ జంక్ష‌న్' ఫేమ్ మోహ‌న్ రాజా ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయ‌నున్నారు. మే నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. ఏడాది చివ‌ర‌లో విడుద‌ల చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి 'కింగ్ మేక‌ర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసే దిశ‌గా యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ టైటిల్ కి సంబంధించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి బాణీలు అందించ‌నున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో క‌లిసి ప్ర‌ముఖ నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. మ‌రి.. 'కింగ్ మేక‌ర్'గా మెగాస్టార్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.