English | Telugu

ఎన్టీఆర్ సినిమా..రెండు రూమ‌ర్లు..!

జ‌న‌తా గ్యారేజ్ కి సంబంధించి రోజుకో వార్త టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా ప్ర‌చారంలో అవీ కీల‌క పాత్ర‌పోషిస్తున్నాయి. జ‌న‌తా గ్యారేజీలో ఓ ప్ర‌త్యేక గీతం ఉంద‌ని, ఆ పాట కోసం త‌మ‌న్నాని సంప్ర‌దించార‌ని ఓ రూమ‌ర్ పుట్టుకొచ్చింది. అంతేకాదు, ఈ సినిమాకి మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడ‌ని, మ‌హేష్ గొంతు జన‌తా గ్యారేజీకి ప్ల‌స్ పాయింట్ గా నిల‌వ‌బోతోంద‌ని కూడా చెప్పుకొన్నారు. అయితే ఇవి రెండూ రూమ‌ర్లే న‌ట‌. అస‌లు.. త‌మ‌న్నా, మ‌హేష్ ల‌ ప్ర‌స్తావ‌నే చిత్ర‌బృందం మ‌ధ్య రాలేద‌ని తెలుస్తోంది. ''త‌మ‌న్నా ఐటెమ్ పాట‌, మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్‌.. ఇవి రెండూ కేవ‌లం ఉత్తి పుకార్లే. మా మ‌ధ్య అలాంటి ప్ర‌స్తావ‌న రాలేదు. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ లాంటిది ఉంది. కానీ అది ఎవ‌రిపై తెర‌కెక్కిస్తార‌న్న‌ది ఇంకా తెలీదు. త‌మ‌న్నా అయితే ఖచ్చితంగా కాదు..'' అని చిత్ర‌బృందం క్లారిటీ ఇచ్చింది. సో.. ఈ రెండూ కేవ‌లం పుకార్లే అన్న‌మాట‌. ఎన్టీఆర్ పక్క‌న ఐటెమ్ పాట‌కు చిందేసేదెవ‌రో త్వ‌ర‌లోనే తేలిపోతుంది.