English | Telugu

ఎన్టీఆర్‌ని భ‌య‌పెడుతున్న‌ది అదే!

ఎన్టీఆర్ ఇప్పుడు మ‌రో ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు. సెంటిమెంట్‌కి ఎదురీత‌బోతున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని క‌ల‌వ‌ర‌పెడుతోంది అదే. ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఇటీవ‌లే ప‌ట్టాలెక్కింది. ఈ సినిమా టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే... `జ‌న‌తా గ్యారేజీ`. ఎన్టీఆర్ సినిమాకి `జ‌న‌తా గ్యారేజీ` అనే టైటిల్ పెడుతున్నారు అన‌గానే ఈ టైటిల్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ మొద‌లైపోయింది. ఎన్టీఆర్ సినిమాకి మాస్ టైటిల్ అయితే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ ఆలోచ‌న‌. అయితే వెరైటీ టైటిల్ తో.. కొత్త‌ద‌నం వైపు అడుగులు వేయ‌డం శుభ‌సూచ‌క‌మ‌ని ఇంకొంత‌మంది భావ‌న‌.

ఈ సినిమాలో ఎన్టీఆర్ మెకానిక్ గా క‌నిపించ‌బోతున్నాడ‌న్న‌దీ అభిమానుల్ని ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే. ఎందుకంటే హీరోలు మెకానిక్‌లుగా క‌నిపించిన సినిమాల్నీ ఫ్లాప్ అయ్యాయి. అంతెందుకు ఎన్టీఆర్ అశోక్ సినిమాలో మెకానిక్‌గా క‌నిపించాడు. ఆసినిమా ఫ్లాప్ అయ్యింది. చిరంజీవి - మెకానిక్ అల్లుడు, రాజ‌శేఖ‌ర్ మెకానిక్ మావ‌య్య సినిమాలూ అట్ట‌ర్ ఫ్లాపే. కెమెరామెన్ గంగ‌తో రాంబాబు సినిమాలో ప‌వ‌న్ మెకానిక్ అవ‌తారంలోనే క‌నిపించాడు. ఆ సినిమా కూడా పోయింది.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మెకానికే అనేస‌రికి ఆ సెంటిముంట్ ఫ్యాన్స్‌ని భ‌య‌పెడుతోంది. అయ‌తే కొర‌టాల శివ‌పై ఉన్న న‌మ్మ‌కం కాస్త రిలీఫ్ ఇవ్వ‌నుంది. మిర్చి, శ్రీ‌మంతుడుతో త‌న మార్క్ ఏమిటో స్ప‌ష్టం చేశాడు కొర‌టాల‌. త‌న నుంచి ఖ‌చ్చితంగా మంచి సినిమా వ‌స్తోంద‌న్న‌ది అభిమానుల ఆశ‌. మ‌రి సెంటిమెంట్‌కి ఎదురీత సాగిస్తున్న ఎన్టీఆర్‌కి ఈ సినిమా ఎలాంటి ప‌లితాన్ని ఇస్తుందో చూడాలి.