English | Telugu
పవన్ ఆ ఛాన్సు ఇవ్వడం లేదు!
Updated : Oct 26, 2015
పవన్ కల్యాణ్ ఇన్‌వాల్వ్‌మెంట్ సినిమాల్లో విపరీతంగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. తన దర్శకుడెవరైనా సరే... పవన్ `డైరెక్షన్`లో నడుచుకోవాల్సిందే. హీరోయిన్ల ఎంపిక, ఫైట్ కంపోజీషన్, డాన్సులు వీటిలో పవన్ ఇన్‌వాల్వ్‌మెంట్ తప్పకుండా ఉంటుంది.కొన్ని ఫైట్లు పవనే కంపోజ్ చేస్తాడు. తెరపై ఫైట్ మాస్టర్ గా పవన్ పేరు కూడా చాలాసార్లు కనిపించింది.
ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి బాబీ అఫీషియల్ దర్శకుడు. అయితే.. డైరెక్షన్ అంతా పసనే చూసుకొంటున్నాడన్నది విశ్వసనీయ వర్గాల సమాచాం. సెట్లో బాబి ఉన్నాడా, లేడా అన్నట్టుంటున్నాడని... మొత్తం అన్నీ పవనే చూసుకొంటున్నాడని తెలుస్తోంది. ఒక్కోసారి బాబి సెట్‌కే రావడం లేదని టాక్. కో ఆర్టిస్టులకు కూడా పవనే సీన్ పేపర్ చదివి వినిపిస్తున్నాడని, బాబి కేవలం పేరుకు మాత్రమే డైరెక్టర్ అని చెప్పుకొంటున్నారు. రామ్ లక్ష్మణ్‌లు ఉన్నా... ఫైట్స్ తానే కంపోజ్ చేస్తున్నాడట.
ఇటీవల ఓ ఐటెమ్ సాంగ్ చిత్రీకరిస్తే... అందులో స్టెప్పులు కూడా పవనే సొంతంగా డిజైన్ చేశాడని టాక్. మొత్తానికి హీరో కమ్ దర్శకుడు కమ్ డాన్స్ మాస్టర్ కమ్ ఫైట్ మాస్టర్ గా పవన్ మారిపోయాడన్నమాట. పవన్ సినిమాల్లో పవన్ జోక్యం చేసుకోవడం మామూలేగానీ, మరీ ఈ స్థాయిలో ఊహించలేదని బాబి తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడని టాక్. పవన్ వీర కెలుకుడుకి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.