English | Telugu
తాతని మరిచితివా తారక్??
Updated : Jan 2, 2016
మాట్లాడితే.. మా తాత. మా బాబాయ్ అంటూ గొప్పలు పోయేవాడు ఎన్టీఆర్. బుడ్డోడి సినిమాలన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకొంటే.. తాతయ్య, బాబాయ్‌ల ప్రస్థావన లేకుండా సినిమా ఉండేది కాదు. ఎన్టీఆర్ స్టెప్పుల్ని అనుకరించి.. బాబాయ్ డైలాగులు వల్లించి ఫ్యాన్స్ చేత విజిల్ వేయించుకొనేవాడు ఎన్టీఆర్. అయితే... ఆ తరవాత బాబాయ్ బాలకృష్నతో తనకున్న లెక్కలు తప్పాయ్! బాబాయ్‌తో దూరం పెరిగింది. అందుకే... బాబాయ్ పేరు అస్సలు తలచుకోవడం లేదు. తన సినిమాల్లో అలాంటి ఛాయలు లేకుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఆడియో ఫంక్షన్లోనూ... తాతయ్య, బాబాయ్ ల పేర్లు స్మరించకపోవడం నందమూరి ఫ్యాన్స్ ని విస్మయపరుస్తోంది. అంతేనా అంటే.. `తాత పేరు చెప్పి ఎదగడం నాన్న నాకు నేర్పించలేదు.. మీకు మీరుగా ఎదగండి అన్నారు` అంటూ.. నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో ఫంక్షన్లో నోరు జారాడు ఎన్టీఆర్. అయితే గతమంతా ఏమైనట్టు? తన తాతయ్య గురించి పేజీలు పేజీలు డైలాగులు చెప్పినప్పడు ఎక్కడ దాక్కున్నట్టు.. `ఎన్ పేరు మురుగన్.. మా తాత నందమూరి నాయగన్` అంటూ పాటలు పాడుకొన్నప్పుడు ఈ అత్మాభిమానం ఏ ఊరు పోయినట్టు.. బాబాయ్ పేరు గుర్తు చేసుకొన్నప్పుడు నాన్న చెప్పిన మాటలు మర్చిపోయాడా??
ప్రస్తుతం నందమూరి అభిమానుల్ని తొలుస్తున్న శేష ప్రశ్నలు ఇవే. ఆఖరికి నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లోనూ వెనుక పెద్ద ఎన్టీఆర్ బొమ్మ కనిపించింది. ఎన్టీఆర్‌కి అసలు సిసలు వారసుడ్ని నేనే అని గొప్పలు చెప్పుకొన్న బుడ్డోడు.. ఇప్పుడ తాత పేరు చెప్పుకొని పైకి రాలేదు అనడం జోక్‌గా మారింది. బహుశా 2015లో బెస్ట్ జోక్ అదేనేమో?