English | Telugu
బ్రహ్మానందం.. కాళ్లబేరం
Updated : Jan 2, 2016
ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు. రకరకాల పాత్రలతో, తన నవ్వులతో, కామెడీ పంచులతో ఎన్నో సినిమాల్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించేశాడు. కాలం గిర్రున తిరిగింది... కొత్త హాస్యనటుడల హవా మొదలైంది. దాంతో బ్రహ్మానందం స్థానం మారింది. ఇప్పుడు అవకాశాల కోసం బ్రహ్మీ పడరాని పాట్లు పడుతున్నాడు. అందుకే దర్శకులకు ఫోన్లు చేసి `నా కోసం మంచి పాత్రలు సిద్ధం చేయండి..` అంటూ నోరు విడచి అడుగుతున్నాడట.
ఇది వరకు బ్రహ్మానందం పారితోషికం విషయంలో ఏమాత్రం మొహమాట పడేవాడు కాదు. రోజుకి రూ.4 లక్షలకు పైగానే వసూలు చేసేవాడు. దానికి తోడు.. సెట్లో కార్ వ్యాన్ ఉండాల్సిందే అని రూలు పెట్టేవాడు. ఇప్పుడు ఈ విషయంలోనూ రిబేట్లు ఇస్తున్నాడట. పాత్ర బాగుంటే.. పారితోషికం గురించి పట్టించుకోను.. ఎంతిచ్చినా ఫర్వాలేదు.. అంటున్నాడట. కార్ వ్యాన్ కూడా నేనే తెచ్చుకొంటా అంటూ ఆఫర్లు ఇస్తున్నాడట.
తన బిహేవెర్‌తో చాలామంది దర్శకుల మనసు నొప్పించాడు బ్రహ్మానందం.. వాళ్లంతా ఇప్పుడు బ్రహ్మీని దూరం పెట్టాలని నిర్ణయించుకొన్నారట. కొంతమంది బడా నిర్మాతలు సైతం `బ్రహ్మానందాన్ని తీసుకోవొద్దు` అని మొహంమీదే చెప్పేస్తున్నార్ట. దాంతో... బ్రహ్మీకి అవకాశాలు కరవయ్యాయని... అందుకే ఇప్పుడు సినిమాల కోసం కాళ్లబేరానికి దిగిపోయాడని చెప్పుకొంటున్నారు. పాపం.. ఓడలు బళ్లవ్వడం అంటే ఇదే.