English | Telugu
ఎన్టీఆర్‌పై సినిమాకి..కథ పురందేశ్వరిదేనా..?
Updated : Apr 12, 2017
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జీవిత కథను సినిమాగా తీస్తానని ఆయన కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ చెప్పడంతో తెలుగు సినిమా పులకించింది. ఎందుకంటే సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర సామాన్యమైనది కాదు. అందుకే ప్రతీ తెలుగు బిడ్డా ఆయన జీవితకథ సినిమాగా వస్తుంది అంటే సంతోష పడ్డారు.
అంతా బాగానే ఉంది కానీ మరి ఆయన కథను ఎటు నుంచి ఎటువైపు మొదలుపెడతారు..అసలు ఎన్టీఆర్‌కు సంబంధించిన అన్ని విషయాలు బాలయ్యకు పూర్తిగా తెలుసా..? అంటూ అభిమానుల్ని రకరకాల ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కథకు సంబంధించిన చర్చల్లో పాల్గొనమని కోరితే నేను పాల్గొంటానన్నారు దగ్గుబాటి పురందేశ్వరి. కథ ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఫినిష్ చేయాలని తమ్ముడు అంటున్నాడు. అలా కాకుండా, కథకు సంబంధించి చర్చలకు పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను అన్నారామె.