English | Telugu

స్పైడర్‌లో రకుల్ ఏంటీ ఇలా ఉంది..?

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ వెయిటేడ్ మూవీ స్పైడర్. తెలుగు సినిమాలో బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న మూవీగా దీనిని చెబుతున్నారు విశ్లేషకులు. సినిమా ఆల్‌మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్‌కొచ్చేసినా ఇంత వరకు టైటిల్ ఏంటో తెలియదు..మహేశ్ లుక్ ఏంటో తెలియదు..ఇలాంటి వాటికి చెక్ పెడుతూ రీసెంట్‌గా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది. గన్ పట్టుకుని స్టైల్‌గా నిల్చున్న మహీని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

సూపర్‌స్టార్ క్యారెక్టర్ ఏంటో తేలిపోవడంతో హీరోయిన్ రకుల్ ఎలా కనిపించబోతోంది అంటూ కొత్త చర్చను లేవదీశారు ఫ్యాన్స్. అయితే ఓ తమిళ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తోందని చెప్పాడు మహేశ్. దీనికి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా పోస్ట్ చేశాడు ప్రిన్స్. ఆ పిక్స్‌లో మెడలో స్టెతస్కోప్ పట్టుకుని నిల్చున్న రకుల్‌ని చూస్తే మహేశ్ పక్కన తేలిపోయినట్లు అర్థమవుతుంది. ఈ లుక్ చూసిన వారంతా వామ్మో అంటున్నారు. మరి సినిమాలో ఏలా ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.