English | Telugu

ఎన్టీఆర్ సినిమాకి బాల‌య్య డైరెక్ష‌న్‌?

టాలీవుడ్‌లో కొబ్బ‌రికాయ కొట్ట‌క ముందే సంచ‌నాలు సృష్టిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్‌. నాన్న‌గారి జీవిత క‌థ‌తో సినిమా తీస్తా.. అంటూ బాల‌కష్ణ ఏ ముహూర్తంలో చెప్పాడో గానీ, అప్ప‌టి నుంచీ అంద‌రి చూపూ ఆ సినిమాపైనే. సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే కాదు, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది ఈ చిత్రం. బ‌హుశా నంద‌మూరి బాలకృష్ణ సినీ జీవితంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌, అత్యంత‌ క్లిష్ట‌మైన ప్రాజెక్ట్ ఇదే కావొచ్చు. అందుకే ఈ సినిమాకి బాల‌య్యే ద‌ర్శ‌క‌త్వం వహిస్తే బాగుణ్ణు అని స‌న్నిహిత వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. బాల‌య్య‌కి కూడా ఎప్ప‌టి నుంచో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని కోరిక‌. ఆ విష‌యాన్ని కూడా చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట‌పెట్టారు.

అయితే తాను ద‌ర్శ‌క‌త్వం వహిస్తే అది పౌరాణిక చిత్రమైతేనే బాగుంటుందని ఆయ‌న ఆలోచ‌న‌. ఎన్టీఆర్ క‌థ సోష‌ల్ సినిమానే అవుతుంది. అందుకే... ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని మ‌రొక‌రికి అప్ప‌గించాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యార్ట‌. నాన్న‌గారి పాత్ర పోషించ‌డం చాలా ఒత్తిడితో కూడుకున్న అంశం.. నాపై బాధ్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. ఈ స‌మ‌యంలో ద‌ర్శ‌క‌త్వం వహిస్తే ఆ బ‌రువు మ‌రింత పెరుగుతుంది... అందుకే ద‌ర్శ‌కత్వం చేయ‌ను అంటూ సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నాడ‌ట బాల‌య్య‌. కానీ ఆయ‌న మ‌న‌సు మార్చే ప్ర‌య‌త్నంలో స‌న్నిహితులు ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి బాల‌య్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటాడో చూడాలి.