English | Telugu

సింగం-3 హిట్టయ్యిందా..? ఫట్టయ్యిందా..?

సూర్య, హరి కాంభినేషన్‌లో వచ్చిన సింగం సిరీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూర్య పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో వచ్చిన ఈ రెండు సిరీస్‌లు అన్నీ సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పంట పండించాయి. అంతేనా హిందీలో సైతం రీమే‌క్ అయి అక్కడ కూడా సూపర్‌హిట్టయ్యింది. లేటేస్ట్‌గా సింగం-3‌గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ టాక్ తొలి రెండు పార్ట్‌లలాగా సక్సెస్‌ అయ్యిందా లేదా అంటే లేదనే అంటున్నారు ప్రేక్షకులు.

భారతదేశ చరిత్ర, రాజకీయాల గురించి ఓ వాయిస్ ఓవర్‌లో చెబుతూ సీరియస్‌గా స్టార్టయ్యిందట సింగం-3. సినిమా అంతా ఓ మాస్ యాక్షన్ మసాలలా ఉందట..తొలి రెండు భాగాల్లో ఉన్నట్లు ఎక్కడా కొంచెం కూడా కామెడీ లేకపోవడంతో ఆడియన్స్ ఆశించినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వలేకపోవడంతో తెలుగులో యావరేజ్ టాక్ రాగా, తమిళనాడులో మాత్రం సింగం-కి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు.