English | Telugu

ఎన్టీఆర్ అన్యాయం చేశాడంటున్న షీలా!

ఎన్టీఆర్ అన్యాయం చేశాడంటూ పరుగు బ్యూటీ బాధపడిపోతోందట. ఏవండోయ్ ఇది విన్నారా! ఎన్టీఆర్ అన్యాయం చేశాడట అని బుగ్గలు నొక్కేసుకోకండి. విషయం ఏంటంటే గతంలో ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన అదుర్స్ ఏ స్థాయి విజయాన్నందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడాసినిమాకి సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. అదుర్స్ లో యంగ్ టైగర్ సరసన నయన్-షీలా మురిపించగా...సీక్వెల్లో కూడా నయన్ కు చోటిచ్చారు. కానీ షీలాకు అన్యాయం చేశారు. షీలా ప్లేస్ లో కమల్ బ్యూటీ ఆండ్రియాను తీసుకున్నట్టు టాక్. అయితే అదుర్స్ లో ఎన్టీఆర్ కెమిస్ట్రీ షీలాతో కన్నా నయనతారతో అదుర్స్ అనిపించింది. పైగా నయన్ ఇప్పుడు మంచి జోరుమీదుంది కానీ షీలా ఎక్కడుందో కూడా తేలీదు. దీంతో ఫేడవుట్ అయిన హీరోయిన్ కన్నా....ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తున్న ఆండ్రియా అయితే బెస్టని డిసైడయ్యారట. మరి ఈసారి నయన్-ఆండ్రియాలో ఎవరు డామినేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.....