English | Telugu
చిరంజీవి సినిమా కాపీ స్టోరీనా..!!
Updated : May 12, 2015
రెండు మూడేళ్లుగా ఊరించి ఊరించి ఆటోజానీగా బరిలోకి దిగుతున్నాడు చిరంజీవి. ఈ సినిమాకి సన్నాహకాలు మొదలెట్టారో లేదో, అప్పుడే కాపీ మరక అంటేసింది. ఆటోజానీ కథ నాదే అని వాసుదేవ వర్మ అనే ఓ రచయిత.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లైన్ వాసు దేవ వర్మ చెవిన పడిందట. అది నేను రాసుకొన్న కథే.. అని ఆయన గోల గోల చేస్తున్నాడు. ప్రభాస్ కోసం తాను తయారు చేసిన 'ఒక్క అడుగు' కథ.. 'ఆటోజానీ' ఒకేలా ఉన్నాయన్నది వాసు వాదన. అయితే దీనిపై పూరి కాంపౌండ్ స్పందించింది. రచయిత గోపీమోహన్ ట్విట్టర్‌లో కాపీ విషయమై ఓ సందేశం పంపారు. ఆటోజానీ విషయంపై ఓ న్యూస్ వినిపిస్తోంది. అది తప్పుడు వార్త. ఈ కథ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే.. రచయితల సంఘంలో చూస్కోండి అంటూ సలహా ఇచ్చారు. మరి వాసుదేవ వర్మ ఏం చేస్తాడో చూడాలి.