English | Telugu

పంచ్ లేదు మూర్తి గారూ..

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఏంటి?? డైలాగులు వ‌రుస క‌ట్టాలి. పంచ్ లు ప‌డాలి. అవి మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నేలా, వాటి గురించి మాట్లాడుకోవాల‌నుకొనేలా ఉండాలి. కానీ 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' ట్రయిలర్లో ఆ పంచ్‌ల శైలి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. రెండు నిమిషాల ట్రైట‌ర్‌లో చూపించాల్సిన‌వ‌న్నీ చూపించేశాడు త్రివిక్ర‌మ్‌. డైలాగులు బాగానే ప‌డ్డాయి. కానీ అందులో పంచ్ లేదు. 'మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే భాద్యత, పిల్లలు మోయాలనిపించే బరువు. కాని నా దృష్టిలో నాన్న అంటే మర్చిపోలేని ఓ జ్ఞాపకం, మ‌నం బాగున్న‌ప్పుడు లెక్క‌ల‌ గురించి మాట్లాడి, క‌ష్టాలున్న‌ప్పుడు విలువ‌ల గురించి మాట్లాడ‌కూడ‌దుసార్‌` అంటూ ఓ మంచి ట‌చ్ ఇచ్చాడు. బ‌న్నీ డాన్సులు, ఫైటింగులు, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఇవ‌న్నీ క‌ట్ట‌క‌ట్టుకొని చూపించాడు. అయితే... మళ్లీ మ‌ళ్లీ మాట్లాడుకొనే రేంజులో ఒక్క పంచ్ కూడా వ‌ద‌ల్లేదు. త్రివిక్ర‌మ్ అంటేనే పంచ్‌ల‌కు ప్ర‌సిద్ది. బ‌రువైన డైలాగులు వ‌దిలాడుగానీ, పంచ్ లు మ‌ర్చిపోయాడు. అదొక్క‌టే కాస్త అసంతృప్తి క‌లిగించింది. మ‌రి సినిమాలో అయినా వినిపిస్తాడో, లేదో..??