English | Telugu

డాక్టర్ సలీమ్ మూవీ రివ్యూ

కథ:

సలీమ్ ఓ అనాధ. కానీ ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అవుతాడు. ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌లో పేదలకు తక్కువ ఫీజుకే వైద్యం చేస్తూ, అనాథలకు హెల్ప్ చేస్తూ వుంటాడు. ఈ సమయంలో అతనికి నిషా(అక్ష)తో జరుగుతుంది. అయితే ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సలీమ్‌ నిషా కోసం అసలు సమయం కేటాయించలేకపోతాడు. దీ౦తో నిషా సలీమ్‌తో పెళ్లిని క్యాన్సల్‌ చేసుకుంటుంది. ఈ సమయంలో అతని ఉద్యోగం కూడా పోతుంది. ఇదే టైంలో రేప్ చేయబడిన నర్మద అనే అమ్మాయిని కాపాడి, తన ఆసుపత్రిలో చికిత్స చేస్తాడు. ఈ విషయాన్ని సహ డాక్టర్లు ఎండీకి చెప్పి,అతని వల్ల ఆసుపత్రికి నష్టాలు వస్తున్నాయంటూ ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఆ తరువాత నర్మద కనబడకుండా పోతుంది. ప్రేమించిన అమ్మాయి నో అనడం, ఉద్యోగం పోవడం, కాపాడిన అమ్మాయి కనపడకుండా పోవడం ఇలా అన్ని సమస్యలు ఒక్కసారిగా రావడంతో సలీమ్ సంకటంలో పడతాడు. ఇదిలా ఉంటే ఓ అమ్మాయిని ఏడిపిస్తున్న నలుగురుని చితకబాది, అనంతరం వారిని కిడ్నాప్‌ చేస్తాడు. అయితే కిడ్నాప్‌ అయిన వారిలో హోంమినిస్టర్‌ కొడుకు కూడా ఉంటాడు. ఇంతకీ సలీమ్‌ వారిని ఎందుకు కిడ్నాప్‌ చేశాడు, తర్వాత వారిని ఏం చేశాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ.:

'సలీమ్' సినిమాకి సెకండాఫ్, ఫాస్ట్ స్క్రీన్ మెయిన్ ప్లస్ పాయింట్స్ గా చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా కొంచెం డల్ గా అనిపించిన ఒక్కసారి సీరియస్ మోడ్ లోకి వచ్చిన తరువాత ఆడియన్స్ అసలు నిరాశపరచదు. డైరెక్టర్ నిర్మల్ కుమార్ సెకండాఫ్ మొత్తాని చాలా గ్రిప్పింగ్ గా తీసాడు. తను థ్రిల్లింగ్ కోసం ప్లాన్ చేసుకున్న ఎలిమెంట్స్, అలాగే కాస్త డిఫరెంట్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. అన్నిటికంటే మించి కథలో ఉన్న పెయిన్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవడం వలన సెకండాఫ్ లో హీరో తీసుకునే స్టెప్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

విజయ్‌ ఆంటోని సహజంగానే.. సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తాడు. మనసునిండా కసి నింపుకుని పగతీర్చుకునే క్యారెక్టర్‌కు అతని లుక్స్‌ అతికినట్టు సరిపోయాయి. దీనికి తోడు నకిలీ సినిమాలో అతనే హీరో కాబట్టి సహజంగానే సీక్వెల్‌కు అతను కరెక్ట్‌ సూటబుల్‌గా అనిపిస్తాడు. కథ కూడా మొత్తం తన చుట్టూనే తిరిగిన అందుకు తగిన న్యాయం చేశాడు. కథ మొత్తం విజయ్‌ ఆంటోని చుట్టూనే తిరగటంతో మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా ఏమి లేదు.

సినిమాటోగ్రాఫర్‌ గణేష్‌చంద్ర అందించిన సినిమాటోగ్రఫి అద్భుత౦గా వుంది. సంగీత దర్శకుడిగా విజయ్‌ ఆంటోని పర్వాలేదనిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌లో మాత్రం దుమ్ము దులిపాడు. దర్శకుడు నిర్మల్‌కుమార్‌ ప్రతిభను కూడా మెచ్చుకోవచ్చు. ఆయనకు ఇదే తొలి సినిమా అయినా ఆడియన్స్‌ను మెప్పించటంలో విజయం సాధించాడు. విజయ్‌ ఆంటోనిని బాగా వినియోగించుకున్నాడు.

మూస దోరణిలో సాగే సినిమాల పట్ల విసుగు చెందిన తెలుగు ఆడియన్స్‌కి సలీమ్‌ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీనికి తోడు ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదల లేకపోవటం కూడా సలీమ్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.