English | Telugu

నిత్య రూ.రెండు కోట్లు అడిగింది

నిత్య‌మీన‌న్‌ది సెప‌రేటు రూటు. క‌థ‌, అందులో పాత్ర న‌చ్చితే గానీ ఏ సినిమా ఒప్పుకోదు. స్టార్లున్నా.. పేరున్న ద‌ర్శ‌కుడైనా `డోన్ట్ కేర్‌` అనే టైపు. పారితోషికం విష‌యంలో ఎప్పుడూ పేచీ పెట్ట‌లేదు. ఇంతిస్తేగానీ చేయ‌ను అని డిమాండ్ చేయ‌లేదు. అలాంటి నిత్య ఇప్పుడో సినిమా కోసం రెండు కోట్లు అడిగి.. నిర్మాత‌ను షాక్‌కి గురిచేసింది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం క్వీన్‌. కంగ‌నారౌన‌త్‌కిఈ సినిమాతో అవార్డులు కూడా ద‌క్కాయి. ఇప్పుడీ చిత్రాన్ని ద‌క్షిణాది భాష‌ల్లో రీమేక్ చేయాల‌ని త్యాగ‌రాజ‌న్‌గ‌త కొంత‌కాలంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే... క‌థానాయిక ఎవ‌ర‌నేది ఆయ‌న డిసైడ్ చేయ‌లేక‌పోతున్నారు. స‌మంత‌, అనుష్క‌, న‌య‌న‌తార‌.. ఇలా చాలామంది క‌థానాయిక పేర్లు ప‌రిశీలించిన త‌ర‌వాత నిత్య‌మీన‌న్ ని సంప్ర‌దించారు త్యాగ‌రాజ‌న్‌. నిత్య ఈ క‌థ‌కు ఓకే చెప్పింది గానీ.. పారితోషికం విష‌యంలో మాత్రం రాజీ ప‌డ‌డం లేదు. రెండు కోట్లిస్తేనే చేస్తా అంటోంద‌ట‌. దాంతో త్యాగ‌రాజ‌న్ బిత్త‌ర‌పోయారు. నిత్య‌కు రెండు కోట్లు ఇచ్చేబదులు ఏ న‌య‌న‌తార‌నో ప‌ట్టుకొంటే త‌న సినిమాకి స్టార్ డ‌మ్ కూడా యాడ్ అవుతుంద‌ని భావిస్తున్నారు. మ‌రి నిత్య‌తో స‌ర్దుకుపోతారా, లేదంటే స్టార్ హీరోయిన్ వెంట‌ప‌డ‌తారా..??? చూద్దాం.