English | Telugu

మనోజ్, ప్రణీతల ఎంగేజ్ మెంట్ హైలైట్స్

పార్క్ హయత్ హోటలో సినీ హరో మంచు మనోజ్, ప్రణీతల నిశ్చితార్థం వేడుక వైభవంగా జరుగుతోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. మనోజ్-ప్రణతి రెడ్డి డిజైనర్ దుస్తులు ధరించి అందంగా మెరిసి పోయారు. ప్రణతి రెడ్డి తన ఫస్ట్ అప్పియరెన్స్ పసుపురంగు పట్టుచీరలో దర్శనమిచ్చింది. కుదనపు బొమ్మలా మెరిసి పోయింది. పురోహితులు ప్రణతిరెడ్డితో, మనోజ్తో గౌరీ పూజలు చేయించారు. అనంతరం మనోజ్-ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, జస్టిస్ చలమేశ్వర్, దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద, శ్యాంప్రసాద్ రెడ్డి, తదితరులు హాజరయ్యా కాబోయే వధువరూలు మనోజ్ ప్రణతిలను ఆశీర్వదించారు.