English | Telugu
`జూనియర్`గా నితిన్!?
Updated : Mar 2, 2022
యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం `మాచర్ల నియోజకవర్గం` అనే సినిమా చేస్తున్నాడు. `ఉప్పెన` భామ కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ ద్వారా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, `మాచర్ల నియోజకవర్గం` రిలీజయ్యేలోపే మరో సినిమాని పట్టాలెక్కించనున్నాడు నితిన్. `నా పేరు సూర్య`తో దర్శకుడి అవతారమెత్తిన రచయిత వక్కంతం వంశీ.. ఈ చిత్రం కోసం మరోమారు మెగాఫోన్ పట్టనున్నాడు. స్టార్ కంపోజర్ హ్యారిస్ జైరాజ్ ఈ మూవీకి బాణీలందించనున్నారు. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్.. నితిన్ కి జోడీగా కనిపించనుందని టాక్. కాగా, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి `జూనియర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. త్వరలోనే నితిన్ - వక్కంతం వంశీ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. `నా పేరు సూర్య`తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన వక్కంతం వంశీ.. నితిన్ `జూనియర్`తోనైనా విజయం అందుకుంటాడేమో చూడాలి.