English | Telugu
వరుణ్ తేజ్ తో నాని దర్శకుడు!?
Updated : Mar 1, 2022
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన `నేను లోకల్`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథ రావు నక్కిన. ఆ చిత్రానికి ముందు `సినిమా చూపిస్త మావ`, తరువాత `హలో గురు ప్రేమ కోసమే`తోనూ ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో `ధమాకా` తీస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. `ధమాకా` తరువాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ చిత్రం చేయబోతున్నాడట త్రినాథరావు నక్కిన. అంతేకాదు.. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనుందని సమాచారం. అలాగే `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్`, `హలో గురు ప్రేమ కోసమే`, `ధమాకా` చిత్రాల రచయిత ప్రసన్న కుమార్ ఈ మూవీకి కథ, మాటలు అందించనున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వరుణ్ తేజ్ - త్రినాథరావు నక్కిన - గీతా ఆర్ట్స్ కాంబో మూవీపై క్లారిటీ రానున్నది.
కాగా, వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని` ఈ నెలలోనే రిలీజ్ కానుండగా.. విక్టరీ వెంకటేశ్ తో కలిసి నటించిన మల్టిస్టారర్ `ఎఫ్ 3` మే 27న విడుదల కానుంది.