English | Telugu

మెగాస్టార్ స‌వ‌తి చెల్లెలి పాత్ర‌కు న‌య‌న‌తారకు క‌ళ్లు తిరిగే రెమ్యూన‌రేష‌న్!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న 'గాడ్‌ఫాద‌ర్' మూవీలో న‌య‌న‌తార న‌టిస్తున్న‌ట్లు ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అఫిషియ‌ల్‌గా నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మోహ‌న్‌లాల్ న‌టించిన మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ 'లూసిఫ‌ర్‌'కు ఇది రీమేక్‌. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. మోహ‌న్‌రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో న‌టించ‌డానికి న‌య‌న‌తార ఇంత‌దాకా ఏ తారా అందుకోనంత భారీ రెమ్యూన‌రేష‌న్ అందుకుంటోంద‌ని తెలియ‌వ‌చ్చింది.

'గాడ్‌ఫాద‌ర్‌'లో చిరంజీవికి స‌వ‌తి చెల్లెలుగా న‌య‌న‌తార క‌నిపించ‌నుంది. ఒరిజిన‌ల్‌లో మంజు వారియ‌ర్ చేసిన ఈ పాత్ర‌ను తెలుగులో చేయ‌డానికి న‌య‌న్ అంత ఈజీగా అంగీక‌రించ‌లేదు. చివ‌ర‌కు భారీ రెమ్యూన‌రేష‌న్ ఆఫ‌ర్‌తో ఆమెను నిర్మాత‌లు ఒప్పించిన‌ట్లు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ రెమ్యూన‌రేష‌న్ ఏకంగా రూ. 4 కోట్లంట‌! న‌య‌న్ న‌టిస్తే 'గాడ్‌ఫాద‌ర్‌'కు బిజినెస్‌ప‌రంగా మంచి వాల్యూ వ‌స్తుంద‌నే అభిప్రాయంతోటే ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను సంప్ర‌దించారు. చిరుకు సోద‌రిగా న‌టించ‌డానికి మొద‌ట ఇష్ట‌ప‌డ‌ని న‌య‌న్‌.. ప్రొడ్యూస‌ర్స్ ఆఫ‌ర్ చేసిన రెమ్యూన‌రేష‌న్‌తో పాటు మోహ‌న్‌రాజా క‌న్విన్స్ చేయ‌డంతో అంగీక‌రించింద‌ని టాక్ న‌డుస్తోంది.

ఒక తెలుగు సినిమాకు ఇంత‌దాకా ఏ యాక్ట్రెస్‌ కూడా ఈ స్థాయిలో పారితోషికాన్ని పొంద‌లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌గా రాణిస్తోన్న పూజా హెగ్డే సైతం రూ. 2.5 కోట్ల రెమ్యూన‌రేష‌న్ అందుకుంటోంది. నయ‌న‌తార‌కు వున్న లేడీ సూప‌ర్‌స్టార్ ఇమేజ్ వ‌ల్లే 'గాడ్‌ఫాద‌ర్‌'లో ఆమెకు అత్య‌ధిక పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌చ్చార‌ని అనుకుంటున్నారు. కాగా ఈ మూవీలో ఆమె రెండో భ‌ర్త పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నాడు.