English | Telugu

అత్తగారిని దువ్వుతున్న నయన్..

ఇప్పటికే రెండు సార్లు లవ్‌లో ఫెయిలై జరిగిన దానిని ఒక పీడకలగా మరచిపోయి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నయన్. కుర్ర హీరోయిన్లే ఫేడవుట్ అవుతున్న సమయంలో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దుమ్ములేపుతోంది నయనతార. వరుస హిట్స్‌తో సౌత్‌లోనే టాప్ పెయిడ్ యాక్ట్రస్‌గా మారింది. అయితే రీసెంట్‌గా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివతో నయన్ ప్రేమాయాణాన్ని నడుపుతోందని కొన్నాళ్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతున్నారట..అతి త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవల విఘ్నేష్ ఓసారి నయనను వాళ్లింటికి తీసుకెళ్లి తన తల్లిని పరిచయం చేశాడు. ఆమెకు నయన పిచ్చి పిచ్చిగా నచ్చిందట. ఇంకేముంది అప్పటి నుంచి ఆత్తగారిని మంచి చేసుకోవడానికి నయనతార తెగ సోపు వేస్తోందట. కొద్దిరోజుల క్రితం అత్తగారిని తన ఇంటికి ఆహ్వానించి స్వయంగా వంట చేసి వడ్డించిందట. ఎంతైనా కాబోయే అత్తగారు కదా..ఈవిడని మంచి చేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నయన్ ప్లాన్ అన్నమాట.