English | Telugu
ఆ దర్శకుడికి 10 కోట్ల ఆఫర్ ఇచ్చిన మాజీ సీఎం...
Updated : Oct 24, 2016
కొడుకును ప్రయోజకుడిని చేయడానికి ఒక తండ్రి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ఆయన కొడుకు నిఖిల్ గౌడను హీరోగా నిలబెట్టడానికి ఏకంగా 75 కోట్ల భారీ బడ్జెట్‌తో..భారీ స్టార్ కాస్టింగ్‌తో జాగ్వార్ సినిమాను నిర్మించారు కుమారస్వామి. అయితే ఆ సినిమా నిఖిల్ ఇంట్రడ్యూస్‌కు బాగానే ఉపయోగపడింది కాని డబ్బులు మాత్రం రాలేదు. అయితే ఈసారి ఎలాగైనా తన కొడుకుకు బంపర్‌హిట్ ఇవ్వాలని డిసైడైన కూమారస్వామి అందుకు తగ్గ దర్శకులను ఎంచుకునే పనిలో పడ్డాడు.
అందులో భాగంగా నిఖిల్‌తో సినిమా చేయమని టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారట. అది కూడా ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడట. ఇప్పటివరకు ఇంత ఎమౌంట్‌ని సురేందర్ రెడ్డి అందుకోలేదు. అదే కనుక నిజమైతే రాజమౌళి, కొరటాల తర్వాత అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగా సురేందర్ రికార్డు సృష్టించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి, కుమారస్వామి ఆఫర్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రజంట్ రాంచరణ్ ధ్రువతో సురేందర్ రెడ్డి బిజీగా ఉన్నాడు..అది పూర్తికాగానే నిఖిల్‌తో సినిమా చేసే అవకాశం ఉంది.