English | Telugu

'అసుర’ వెనక్కి తగ్గాడు

తన సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్‌ అయినా ఉండొచ్చు. అలాగని ఇంకో రెండు క్రేజున్న సినిమాలతో పోటీ పడితే వాళ్లకూ నష్టం, తనకూ నష్టం. అందుకనే నారా రోహిత్‌ వెనక్కి తగ్గాడు. ఈ యువ కథానాయకుడి కొత్త సినిమా ‘అసుర’ వారం వాయిదా పడుతున్నట్లు సమాచారం. ముందు అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా 29న విడుదల కావాలి. ఐతే అదే రోజు పండగ చేస్కో, రాక్షసుడు రిలీజవుతున్నాయి. వాటికి కూడా మంచి క్రేజే ఉంది. ‘అసుర’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సెన్సార్‌ రిపోర్ట్‌ కూడా పాజిటివ్‌గా వచ్చింది. ‘అసుర’ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ.. పోటీ ఎందుకని వారం వాయిదా వేసి జూన్‌ 5న సినిమాను రిలీజ్‌ చేద్దామని ఫిక్సయినట్లు సమాచారం. 5న కూడా రోహిత్‌కు రెండు సినిమాలతో పోటీ ఉంది. నాగశౌర్య హీరోగా నటించిన ‘జాదూగాడు’తో పాటు సంపూర్ణేష్‌ బాబు సినిమా ‘సింగం 123′ అదే రోజు రిలీజవుతాయి. ఐతే వాటితో పోలిస్తే ‘అసుర’కే కొంచెం క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమస్య లేదు. కృష్ణ విజయ్‌ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమాకు రోహిత్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ప్రియా బెనర్జీ కథానాయిక. సాయికార్తీక్‌ సంగీత దర్శకుడు.