English | Telugu

శృతి హాసన్ కల నెరవేరింది

బాలీవుడ్‌లో రాణించాలనేది శృతి కల. అందుకే ముందుగా హిందీ సినిమాతోనే తెరంగేట్రం చేసింది. మొదట్లో ఆమెకి కాలం కలిసి రాకపోయినా కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని దక్కించుకుని శృతి ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా బిజీ అయింది. ఆమె నటించిన గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకి పైగా గ్రాస్‌ కలెక్షన్లు సాధించి, ఈ ఏడాదిలో ఇంతవరకు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం మూడు భారీ హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న శ్రుతికి మరో ఆఫర్ దక్కినట్టు సమాచారం. ఇమ్రాన్‌ ఖాన్‌ సరసన ఆమె ఓ చిత్రంలో నటించడానికి కమిట్‌ అయిందట. దీంతో బాలీవుడ్ లో బిజీ అవ్వాలనే కల నెరవేరినట్లు సిన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు సౌత్ లో శృతి వరుస ఆఫర్ల తో టాప్ లో కొనసాగుతోంది. మహేష్‌బాబు, సూర్య, అజిత్‌తో లాంటి స్టార్ల సినిమాతో తన హవా కొనసాగిస్తోంది.