English | Telugu

ఇర‌కాటంలో చైతూ - స‌మంత‌ల పెళ్లి?

అఖిల్ ల‌వ్ స్టోరీకి ట్రాజెడీ ఎండ్ ప‌డుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. స‌డ‌న్‌గా అఖిల్ పెళ్లి కాన్సిల్ అయిపోయింద‌న్న విష‌యాన్ని టాలీవుడ్‌ని కుదిపేసింది. కార‌ణాలు ఇవీ అని స్ప‌ష్టంగా తెలియ‌క‌పోయినా... అఖిల్‌, శ్రియా రెడ్డిల బ్రేక‌ప్ మాత్రం నిజ‌మ‌ని నిర్థార‌ణ అయిపోయింది. అటు నాగ్ నోరు విప్ప‌క‌పోయినా, ఇటు అఖిల్ స్పందించ‌క‌పోయినా... బ్రేక‌ప్ ఖాయ‌మైపోయింద‌న్న సంగ‌తి.. అంద‌రికీ తెలిసిపోయింది. అయితే ఈ టోట‌ల్ ఎపిసోడ్ చూసి.. స‌మంత జాగ్ర‌త్త‌పడిపోతున్న‌ట్టు తెలుస్తోంది.

అఖిల్ - శ్రియ రెడ్డి ప‌రిస్థితీ త‌న‌కీ ఎదురైతే ఏంట‌ని భ‌య‌ప‌డుతోంద‌ట‌. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల నిశ్చితార్థం ఇటీవ‌లే ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిశ్చితార్థం అంటే స‌గం పెళ్లంటారు. అయితే అఖిల్ కూడా ఇలానే పెద్ద‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా నిశ్చితార్థం చేసుకొన్నాడుగా. తీరా చూస్తే.. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. నిశ్చితార్థానికీ, పెళ్లికీ ఇంతింత గ్యాప్ వ‌స్తే... ఏ రోజున ఏం జ‌రుగుతుందో అనే టెన్ష‌న్ వెంటాడుతుంటుంది.

అందుకే అఖిల్‌లా త‌న పెళ్లి కాకూడ‌ద‌ని స‌మంత జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టు, ఇక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా పెళ్లికి ఏర్పాట్లు చేసేసుకొందామ‌ని... చైతూని తొంద‌ర‌పెడుతోంద‌ని తెలుస్తోంది. అయితే అఖిల్ వ్య‌వ‌హారంఇలా చెడి.. కాస్త ఇబ్బందుల్లో ఉన్న నాగ్‌.. ఇప్ప‌టికిప్పుడు చైతూ పెళ్లి చేస్తాడా?? అనేది అనుమానంగా మారింది. స‌మంత క‌ల నెర‌వేరాలంటే.. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డాల్సిందే.