English | Telugu

నాగ్‌ బ‌తిమాలినా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు

అఖిల్ పెళ్లి ఆగిపోవ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకు ఆగిపోయింది? కార‌కులు ఎవ‌రన్న విష‌యంలో హాట్ హాట్ గా చ‌ర్చించుకొంటున్నారు. అఖిల్ శ్రియా భూపాల్ ల‌పెళ్లి యూర‌ప్‌లో చేయాల‌ని ఇరు కుటుంబ స‌భ్యులూ నిర్ణ‌యించుకొన్నారు. అతిథుల కోసం దాదాపు వంద టికెట్ల వ‌ర‌కూ అడ్వాన్స్ బుకింగ్ చేశారు. ఇప్పుడు ఆ టికెట్ల‌న్నీ క్యాన్సిల్ చేసుకోవ‌డం వ్య‌వ‌హారం మొత్తం వెలుగులోకి వ‌చ్చింది. ఇటీవ‌ల రెండు కుటుంబాల మ‌ధ్య ఆఖరి మీటింగ్ జ‌రిగింద‌ట‌. అక్క‌డే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకొందామ‌న్న ప్ర‌తిపాద‌న‌ని జీవీకే ఫ్యామిలీ తీసుకొచ్చింద‌ట‌.

నాగార్జున మాత్రం నిశ్చితార్థం కాన్సిల్ చేసుకోవ‌డానికీ, పెళ్లి ఆప‌డానికీ స‌సేమీరా అన్న‌ట్టు టాక్‌. ఆఖ‌రి క్ష‌ణం వ‌రకూ ఈ పెళ్లి ఏదోలా చేయాల‌న్న ఉద్దేశంతో నాగ్ క‌నిపించాడ‌ని, జీవీకే ఫ్యామిలీని శ‌త‌విధాలా బ‌తిమాలాడాని చెప్పుకొంటున్నారు. కేవ‌లం అఖిల్ ఇష్టాన్ని, అత‌ని ప్రేమ‌నీ గుర్తించిన నాగ్‌... ఎలాగైనా స‌రే.. పెళ్లి కూతురి ఫ్యామిలీని ఒప్పించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడ‌ట‌. పెళ్లి ఆగిపోతే.. ప‌ది మందీ ప‌ది ర‌కాలుగా అనుకొంటార‌ని అడ్డు చెప్పాడ‌ట‌. కానీ జీవీకే ఫ్యామిలీ ఏమాత్రం మెత్త‌ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. నిజానికి పెళ్లి ఆగిపోతే పెళ్లి కూతురి ఫ్యామిలీ బాధ‌ప‌డాలి.. వాళ్లు బ‌తిమాలు కోవాలి.. ఇక్క‌డేంటి?? అంతా రివ‌ర్స్‌గా జ‌రిగిందంటూ టాలీవుడ్‌లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.