English | Telugu

రాజమౌళి హాలీవుడ్‌కి టెండర్ పెట్టాడా?



రాజమౌళి ‘బాహుబలి’ సినిమా ఇటు దక్షిణాదితోపాటు ఉత్తరాదిని కూడా కొల్లగొట్టేసింది. ఇప్పుడు ఎక్కడ విన్నా రాజమౌళి నామస్మరణే. అందరి ఎదురు చూపులు ‘బాహబలి-2’ కోసమే... కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసమే. బాలీవుడ్‌లో కూడా ‘బాహుబలి’ ద్వారా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్‌కి కూడా టెండర్ పెట్టారా అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే ‘బాహుబలి-2’ సినిమాలో విలన్‌గా నటించడానికి హాలీవుడ్ స్టార్ నాథన్ జాన్స్‌ని రాజమౌళి సంప్రదిస్తున్నాడని సమాచారం. హాలీవుడ్ స్టార్ నాథన్ ఇప్పటికే ఒక తమిళ సినిమాలో నటించాడు. ఒక హిందీ సినిమాలో కూడా నటించాడు. నాథన్ ‘బాహుబలి-2’లో కూడా నటించాడంటే ఆ సినిమా హాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించడం సహజం. అక్కడి వాళ్ళకి రాజమౌళి మేకింగ్ స్టైల్ నచ్చేసిందనుకోండీ... ఏ యూనివర్సల్ స్టూడియో నుంచో రాజమౌళికి ఫోన్ వచ్చిందనుకోండి... ఇక మన తెలుగోడు హాలీవుడ్‌కి కూడా టెండర్ పెట్టేస్తాడు... ఊహ చాలా బావుంది కదూ... ఏమో ఈ ఊహ నిజం అయినా అవ్వచ్చేమో.