English | Telugu
ఇస్మార్ట్ భామకు బంపరాఫర్.. మహేష్ మూవీలో ఛాన్స్!!
Updated : Sep 3, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 'అతడు', 'ఖలేజా' చిత్రాల అనంతరం వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటించనుంది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నభా నటేష్ నటించనుందని టాక్ వినిపిస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే మెజారిటీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఉంటుంది. ఆయన గత రెండు చిత్రాలు అల వైకుంఠపురములో, అరవింద సమేత చిత్రాలలో ఈషా రెబ్బా, నివేదా పేతురాజ్ సందడి చేశారు. అలాగే ఇప్పుడు మహేష్ తో చేసే మూవీలో కూడా సెకండ్ హీరోయిన్ రోల్ ఉందని.. ఆ రోల్ కోసం నభా నటేష్ ని త్రివిక్రమ్ ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.
'నన్ను దోచుకుందువటే'తో టాలీవుడ్ పరిచయమైన నభా నటేశ్.. 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆమె నితిన్ కు జోడీగా నటించిన 'మ్యాస్ట్రో' విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా ఆమె మహేష్ మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది అంటున్నారు. మరి మహేష్ మూవీతో నభా నటేష్ కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.