English | Telugu
సేతుపతితో మరోసారి త్రిష?
Updated : Aug 31, 2021
`96`.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని వీర ప్రేమికుడిగా ఆవిష్కరించిన చిత్రం. అంతేకాదు.. అందాల తార త్రిషని మళ్ళీ ఫామ్ లోకి తీసుకువచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టోరి. తెలుగులో `జాను` పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. మాతృక దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ రీమేక్ లో శర్వానంద్, సమంత జంటగా నటించారు. విమర్శకుల ప్రశంసలు పొందినా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.
ఇదిలా ఉంటే.. `96` దర్శకుడు ప్రేమ్ కుమార్ తో విజయ్ సేతుపతి మరోసారి జట్టుకట్టనున్నారట.`96` తరహాలో ఇది కూడా పరిణితి చెందిన ప్రేమికుల కథతో రూపొందనుందని సమాచారం. అంతేకాదు.. ఇందులోనూ త్రిష నాయికగా నటించే అవకాశముందని కోలీవుడ్ వర్గాల టాక్. త్వరలోనే విజయ్ సేతుపతి, త్రిష, ప్రేమ్ కుమార్ సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానుంది. మరి.. `96` తరహాలో రాబోయే చిత్రంతోనూ ఈ త్రయం మెమరబుల్ హిట్ ని అందుకుంటుందేమో చూడాలి.