English | Telugu

మెగా హీరోలిద్ద‌రూ హ్యాండిచ్చారా??

వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌ల‌తో వేరు వేరుగా ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి సినిమాలు చేయ‌డానికి రెడీ అయ్యారు. వ‌రుణ్‌తేజ్ - శ్రీ‌నువైట్ల క‌ల‌యిక‌లో మిస్ట‌ర్‌కి క్లాప్ ఇచ్చారు. అయితే ఈసినిమా ముందుకీ వెనక్కీ జ‌రుగుతోంది. షూటింగ్ ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు. వ‌రుణ్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యాడ‌ని, లేదు... లేదు ఈ సినిమా ఉంద‌ని వార్త‌లొచ్చాయి. చిత్ర‌బృందం ఇప్ప‌టికే ఒక‌టికి రెండు సార్లు ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. అయితే వ‌రుణ్‌తేజ్ కి ఈ సినిమా చేయ‌డం ఇష్టంలేద‌న్న‌ది ఫైన‌ల్ టాక్‌. దానికితోడు ఆగ‌స్టు నుంచి శేఖ‌ర్ క‌మ్ముల సినిమాకి ప‌చ్చ‌జెండా ఊపేశాడ‌ట‌. ఠాగూర్ మ‌ధు కి ఆగ‌స్టు వ‌ర‌కూ కాల్షీట్లు ఇచ్చిన వ‌రుణ్‌తేజ్‌.. ఆలోగా సినిమా పూర్తి చేసుకోంటే చేసుకోండి.. లేదంటే లేదు అని తెగేసి చెబుతున్నాడ‌ట‌. మ‌రోవైపు సాయిధ‌ర‌మ్ ప‌రిస్థితీ అంతే. సాయిధ‌ర‌మ్ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అది అతీగ‌తీ లేదు. ఈ సినిమా కూడా ఇప్ప‌ట్లో మొద‌లయ్యే ఛాన్స్ లేద‌ని టాక్‌. తిక్క పూర్త‌వ్వ‌గానే సాయిధ‌ర‌మ్ - బివిఎస్ ర‌విల జ‌వాన్ సెట్స్‌పైకి వెళ్తుంది. అంటే... ఈ మెగా హీరో కూడా హ్యాండిచ్చిన‌ట్టే క‌నిపిస్తున్నాడు.